11-06-2025 02:17:37 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ జన్మదిన వేడుకలు బుధవారం మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గాదె సత్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విజిత్ కుమార్ జన్మదిన వేడుకలకు పట్టణ నాయకులు, మండలాల నాయకులు పెద్ద మొత్తంలో తరలి వచ్చి కేక్ కట్ చేసి సంబురంగా వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.