గ్రూప్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
ఏర్పాట్లలో లోపాలు ఉండొద్దు
కలెక్టర్ మను చౌదరి
సిద్దిపేట, జూన్ 5(విజయక్రాంతి): ఈ నెల 9న నిర్వహించనున్న గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పరీక్ష నిర్వహణపై పరీక్షల అబ్జర్వర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. జిల్లాలోని 21 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 8,223 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, పరీక్ష కేంద్రా ల్లో అన్ని వసతులు ఏర్పా టు చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు ఎలాం టి ఎలక్ట్రానిక్స్ వస్తువులు పరీక్ష హాల్‌లోకి తీసుకురాకుండా జాగ్రత్త పడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్‌పై ఫొటో లేక పోయినా, పేరు తప్పుగా వచ్చినా అఫిడవిట్ తీసుకురావాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సహాయకులుగా ఇంటర్ లేదా ఆ లోపు చదివిన వారికి మాత్రమే అవకాశం కల్పించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ , ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీపీ రాజు, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.






