calender_icon.png 12 November, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగవతిలో ఘనంగా "ఫ్యాన్సీ కార్నివాల్"

12-11-2025 07:04:41 PM

ముకరంపుర (విజయక్రాంతి): నగరంలోని భగవతి హై స్కూల్లో బుధవారం "ఫ్యాన్సీ కార్నివాల్" ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పాఠశాలల చైర్మన్ బి. రమణ రావు, డైరెక్టర్ బి. విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో కేజీ నుండి 2వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని భారత సైన్యం, నేవీ, వివిధ భారతీయ రాష్ట్రాల సాంస్కృతిక వేషధారణలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా దేశభక్తిని ప్రతిబింబించే “ఆపరేషన్ సిందూర్” ప్రదర్శన ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.