calender_icon.png 12 November, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల ఉపాధ్యాయుడు నాంపల్లి నాగభూషణ్ కు ఎస్ టి యు టి ఎస్ రాష్ట్ర కార్యవర్గంలో చోటు

12-11-2025 07:08:24 PM

కుభీర్ (విజయక్రాంతి): ఎస్ టి యు టి ఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాంపల్లి నాగభూషణ్ ఎన్నికయ్యారు. దీంతో ఆయనను బుధవారం మండల ఎస్ టి యు టి ఎస్ మండల కార్యవర్గం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. హైదరాబాదులోని ఎస్టీయు సంఘ భవనంలో జరిగిన రాష్ట్ర 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో నిర్వహించిన ఎన్నికలలో నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిగ్వా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న నాంపల్లి నాగభూషణ్ ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఆయన బుధవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, సిపిఎస్ రద్దు, రిటైర్డ్ ఉపాధ్యాయుల బకాయిలు, ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం తమ సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని పేర్కొన్నారు. నిరంతరం ఉపాధ్యాయుల సమస్యలతో పాటు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ సంఘం ఆధ్వర్యంలో నిరంతరం అందుబాటులో ఉంటూ కృషి చేస్తానని వివరించారు. ఈ సందర్భంగా ఎస్ టి యు టి ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కత్తి నాగోరావ్, గాడేకర్ పవన్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.