12-11-2025 07:02:55 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. మాటకారి మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తిన ఈ సమయంలో, ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, సీనియర్ నాయకుల సమన్వయంతో ప్రజల పక్షాన నిలబడి, అనేక సమస్యలపై చైతన్య స్ఫూర్తిని పెంపొందిస్తున్నారు.
ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, పార్టీకి నిబద్ధతతో పనిచేసే నాయకుల అభిప్రాయం ప్రకారం, చుంచుపల్లి మండల బిఆర్ఎస్ అధ్యక్షుడిగా, ముత్యాల రాజేష్ నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు ముత్యాల రాజేష్ తెలంగాణ జాతిపిత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు.