31 March, 2026 | 11:41 PM

ప్రభుత్వ లాంఛనాలతో జవాన్‌కు వీడ్కోలు

06-11-2024 12:01 AM

భద్రాచలం, నవంబర్ 5: భద్రాచలానికి చెందిన ఆర్మీ జవాన్ కొంగా సాయిచందర్‌రావు అస్సాం రాష్ట్రంలోని ఆర్మీ క్యాంప్ పరిసరాల్లో ఈ నెల 3న ఏనుగుల దాడిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని ప్రత్యే క విమానంలో అస్సాం నుంచి హైదరాబాద్‌కు తరలించి, అంబులెన్సులో భద్రాచలానికి మంగళవారం చేర్చారు. ఆయన అం తిమ యాత్రను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.