30 June, 2026 | 11:55 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

06-06-2025 01:01 AM

సదాశివపేట, జూన్ 5 :సదాశివపేట మండలం మెలిగిరి పేట గ్రామానికి చెందిన రాజారెడ్డి (48) గురువారం ఉదయం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు కథనం.. గురువారం ఉదయం తన సొంత పొలంలో డైరీ ఫాం ఉన్నందున పశువులకు మేత కోయడానికని వెళ్ళాడు,

ఆ క్రమంలో విద్యుత్ బోరుకు సరఫరా అవుతున్న సర్వీస్ వైర్ ప్రమాదవశాత్తు తెగి అతనిపై పడడంతో విద్యుత్ షాక్ కు గురికావడంతో  రాజారెడ్డిని చుట్టు పక్కల వారి సహకారంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు నిర్ధారించిచెప్పారు.