24 August, 2026 | 11:26 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

చెట్లు నరికిన రైతుకు జరిమానా

28-11-2024 02:00 AM
  1. రూ.50 వేలు అదనంగా  ఇవ్వాలన్న కానిస్టేబుల్?
  2.  మనస్థాపంతో  ఆత్మహత్యాయత్నం

నాగర్‌కర్నూల్, నవంబర్ 27 (విజయక్రాంతి): పంట పొలానికి అడ్డుగా ఉన్నాయని హరితహారం మొక్కలను నరికిన రైతుకు పంచాయతీ కార్యదర్శి జరిమానా విధించారు. మనస్థాపం చెందిన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం పద్మనపల్లి గ్రామంలో ఈ నెల 22న చోటుచేసుకుగా బుధవారం వెలుగులోకి వచ్చింది.

గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్‌రెడ్డి తనకున్న 16 ఎకరాల్లో వేరుశెనుగ పంటను సాగు చేశాడు. రోడ్డు పక్కనే ప్రభుత్వం హరితహారంలో భాగంగా మొక్కలు నాటింది. అవి ఏపుగా పెరిగి పొలానికి అడ్డుగా ఉన్నాయన్న ఉద్దేశంతో శ్రీకాంత్‌రెడ్డి ఈ నెల 18న 22 చెట్లను నరికివేశాడు. ఇది తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి భానుచందర్ రూ.8 వేలు జరిమానా విధిస్తూ రైతుకు నోటీసు జారీ చేశారు. దీంతో పాటు తనపై దుర్భాషలాడరన్న కారణంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీస్ స్టేషన్‌లోని ఓ కానిస్టేబుల్ రైతుకు ఫోన్ చేసి ఏడేళ్ల జైలు శిక్ష తప్పకుండా అనుభవించాల్సిందేనని  బెయిల్ కూడా రాదని బెదిరించారు. లేదంటే జరిమానాతో పాటు మరో రూ.50 వేలు అదనంగా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో కలత చెందిన శ్రీకాంత్‌రెడ్డి ఈ నెల 22న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా దీనిపై పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేసింది నిజమేనని, పోలీస్ సిబ్బంది రైతును బెదిరించలేదని ఎస్సై వివరణ ఇచ్చారు.