17 April, 2026 | 2:31 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ఇక సులువుగా.. యూరియా బుకింగ్: ఏవో నాగరాజు

08-02-2026 03:33 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): ఇక నుండి రైతులు ఇంటి నుండి యూరియా బుకింగ్ చేసుకోవచ్చని ఏవో నాగరాజు తెలిపారు. బెజ్జూర్ మండలంలో రైతులు సులువుగా ఇంటి నుండే యూరియా బుకింగ్ చేసుకోవచ్చని ఏవో నాగరాజు తెలిపారు. ఫెర్టిలైజర్ యాప్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఇకపై రైతులు యూరియా కోసం ఎక్కడికి తిరిగి అడగాల్సిన అవసరం లేదు ఇకపై మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఫర్టిలైజర్ అప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఎక్కడ స్టాక్ ఉందో చూపిస్తుంది.

ఇకపై మీరే బుక్ చేసుకొని మీకు కావలసిన చోట ఎరువులు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి రైతు ఫర్టిలైజర్ (యూరియా) బుకింగ్ అప్ యూరియా బుక్ చేసుకోవాలని తెలిపారు. యూరియా బుకింగ్ అయిన తరువాత దుకాణానికి వెళ్లేటప్పుడు రైతులు క్రింది పత్రాలు యూరియా బుకింగ్ ఐడి నెంబర్, ఆధార్ కార్డ్, పట్టాదారు పాసుపుస్తకం జిరక్సులు తీసుకువెళ్తే వెంటనే యూరియా అందిస్తారని తెలిపారు. ఇట్టి విషయాన్ని రైతులందరూ గమనించి ఇబ్బందులు పడకుండా సులువుగా మొబైల్ ద్వారా బుకింగ్ చేసుకొని యూరియా పొందాలని వారు కోరారు.