calender_icon.png 8 February, 2026 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

08-02-2026 03:27:05 PM

ఆ పార్టీ కి గుడ్ బై చెప్పిన సీనియర్ నాయకులు

మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరిన మాజీ ఎంపీపీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ముందు మంథనిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు మంథని మాజీ ఎంపీపీ మదాడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంత రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు  రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు ఎంఎస్ రెడ్డి, రామడుగు మారుతీ, రాదంటి శంకర్ లు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోష కరమన్నారు. మంథని పట్టణం తో పాటు మంథని నియోజకవర్గం అభివృద్ధి కోరకు వారు ముందుకు రావడంతో మంథని లో పేద బడుగు బలహీన, మైనారిటీ వర్గాల అభివృద్ధి కొరకు వారి అనుభవంతో పాటు సలహాలు సూచనలు కుడా తీసుకుంటూ.. రానున్న రోజుల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నెత్రుత్వంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్ళతామని మంత్రి అన్నారు.