6 June, 2026 | 7:05 PM

ఫార్మర్ రిజిస్టీ తప్పని సరి

06-06-2026 06:20 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఆధార్తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11 నెంబర్లతో విశిష్ట సంఖ్య (యూనికోడ్)ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది.వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది.భూమి ఉన్న ప్రతి రైతు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరములతో కూడిన సమాచారంతో ఈఫార్మర్ రిజిస్ట్రీ నిర్మించబడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా పొందిన ఐడినీ ప్రభుత్వ పథకాలు అయినటువంటి పీఎం కిసాన్ ప్రభుత్వ రాయితీలు, రైతు భరోసా,ఫెర్టిలైజర్ కొనుగోలుతో లింక్ చేసే అవకాశం ఉన్నది.

కావున రైతులు అందరూ తప్పని సరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలి.రైతు విశిష్ట సంఖ్యను (ఫార్మర్ ఐడి) పొందుటకు మీ ఆధార్ మరియు భూ యాజమాన్య పాస్ పుస్తకము ఆధార్కు లింక్ చేయబడిన మొబైల్ నెంబరు తీసుకొని సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా మీ సేవను సంప్రదించి ఫార్మర్ ఐడీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్ తెలిపారు.శనివారం మండలంలోని అక్కంపల్లి గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్ నమోదు ప్రక్రియ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి వెంకా గౌడ్,ఏవో సాయికిరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.