9 May, 2026 | 11:02 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

కరెంట్ కోతలపై రైతుల అందోళన

17-03-2026 01:49 PM

సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు 

సదాశివనగర్,(విజయక్రాంతి): వేసవి కాలం ఆరంభానికి ముందే కరెంటు కష్టాలు మొదలయ్యాయి. గత వారం రోజుల నుండి  మండలంలోని పద్మాజివాడి సబ్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలకు సరఫరా కరెంటులో కోతలు(Power Cuts) విధిస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం సబ్ స్టేషన్(Substation) ను ముట్టడించారు.

ముడేగాం, పద్మాజీవాడి రైతులు తమ పంటలకు కరెంట్ సరఫరా లో 2నుండి 3 గంటలు కోతలు విడిస్తున్నారని, దింతో చేతికి వచ్చిన పంటలు ఎండి పోయే పరిస్థితి నెలకొందని రైతులు విద్యుత్ అధికారులు(Electricity Officials) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవికాలం ఆరంభం కాకముందే ఇలా కోతలు విధించడంపై అభ్యత్రం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు కరెంటు కోతలపై ఫోన్లు చేస్తే ఎవరు కూడా స్పందించడం లేదని రైతుల ఆరోపించారు. వ్యవసాయానికి కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముడేగాం,పద్మాజివాడి రైతులు పాల్గొన్నారు.