17 April, 2026 | 3:48 PM

Breaking News

గాయని మంగ్లీపై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న   •   కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •  

పండుగ వాతావరణంలో రైతు భరోసా

25-06-2025 01:59 AM

రైతులతో కలిసి ముఖ్యమంత్రి సందేశాన్ని వీక్షించిన కలెక్టర్

అదిలాబాద్, జూన్ 24 ( విజయక్రాంతి ): రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంలో భాగంగా ప్రవేశ పెట్టిన రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తు న్న ‘రైతు భరోసా సంబరాలలో భాగంగా రా ష్ట్ర ముఖ్యమంత్రి రైతులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండగ వాతావరణంలో జరుపుకున్నారు.

గుడిహత్నూర్ మండలం సీతగొంది రైతు వేదికను మామిడి తోరణాలతో అలంకరించి పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా రైతులతో కలిసి హాజరై ముఖ్యమంత్రి సందేశాన్ని వీక్షించారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 49 రైతు నేస్తం,  రైతు వేదికలలో పండుగ వాతావరణంలో 300 మంది రైతులతో పండుగ వాతావరణంలో విజయవం తంగా నిర్వహించడం జరిగింది. రైతు భరో సా పథకం లో భాగంగా 1,63,237 రైతులకి గాను 332.48 కోట్లు  రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు