11 August, 2026 | 1:37 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

మున్నూరు కాపు సంఘానికి సహకారం అందిస్తా..

25-06-2025 01:57 AM

ఎమ్మెల్యే కోవలక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 24( విజయక్రాంతి): మున్నూరు కాపు సంఘం అభి వృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రెబ్బన మం డలం పులికుంట గ్రామానికి చెందిన కుందారపు శంకరమ్మ  మున్నూరు కాపు సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైన సందర్బంగా మంగళవారం ఎమ్మెల్యేను  మర్యాద పూర్వకంగా కలిశారు.

అనంతరం ఎమ్మెల్యే  శాలువాతో సన్మానిం చి శుభాకాంక్షలు తెలిపారు. సంఘమ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మున్నూరు కాపు సంఘం సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో  జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, తుడుం దెబ్బ  రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచ య్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు మార్సకోల సరస్వతి,సింగల్ విండో చైర్మన్ పెంటు, వాంకిడి మాజీ జెడ్పిటిసి అజయ్ , నాయకులు పాల్గొన్నారు.

పేదల పాలిట వరం సీఎంఆర్‌ఎఫ్ 

సీఎంఆర్‌ఎఫ్ పథకం పేదల పాలిట వ రం లాంటిదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం కెరమెరి మండల కేంద్రంలోని తహశీల్దార్కార్యాలయం ఆవరణలో బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహా య నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాజీ ఎంపిటిసి, బిఆర్‌ఎస్ నాయ కుడు దేశ్ముఖ్ ఇఫ్టేకర్ ఇటీవల రోడ్డు ప్రమా దం జరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనతో ఫోన్‌లో మాట్లాడి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దూర్పదాబాయి, నాయకులు అబ్దుల్ కలాం, యునూస్ తదితరులు పాల్గొన్నారు.