1 July, 2026 | 8:05 PM

అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం

01-07-2026 06:55 PM

చెవిలో పువ్వులతో బిఆరెస్  వినూత్న నిరసన

నేరేడుచర్ల,(విజయక్రాంతి): రైతు చెవిలో పువ్వు పెట్టి అధికారంలోకి వచ్చి,ఇప్పుడు రైతు కష్టాలు మాత్రం గాలికొదిలేశారని, చేతగాని వాగ్దానాలు హామీ ఇచ్చి, నేడు అమలు చేయలేక తలలు పట్టుకొని బికారి మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి అధికారంలో నుంచి తప్పుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్ కుమార్ అన్నారు. బుధవారం నేరేడుచర్ల మండల కేంద్రంలో రైతు దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు చెవిలో పువ్వులతో వినూత్న  నిరసన నిరసన తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ దగా మాటలతో అధికారంలోకి వచ్చి దిగాలు పడ్డ ముఖ్యమంత్రి, రైతు భరోసా విషయంలో పూర్తిగా అభాసుపాలయ్యి, రైతులను మోసానికి గురి చేశారు.

ఈ సంవత్సరం ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు కురిసే పరిస్థితి లేక రైతులు భయంతో బిక్కు బిక్కుమంటూ బతుకుతుంటే మరోపక్క రైతు భరోసా వేయకుండా కేవలం ఒకటి రెండు ఎకరాల వారికి మాత్రమే వేసి మిగతా రైతులని ఏమారుస్తున్న ఈ ముఖ్యమంత్రి కి ఇంకొక క్షణం కూడా పరిపాలించే అర్హత లేదన్నారు. ఆసరా పెన్షన్లు రెట్టింపు చేస్తామని వివాహo అయిన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని, ప్రతి ఇంటికి 500 రూపాయలకే గ్యాసు సరఫరా చేస్తామని,విద్యార్థినులకు ఉచిత స్కూటీ ఇస్తామని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని బీసీలకు ఉచితంగా షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేస్తామని ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.