1 July, 2026 | 8:50 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం

01-07-2026 07:39 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు గ్రామ సర్పంచ్ గొల్ల అరుణ్ స్వామి యాదవ్ ప్రత్యేక చర్యలతో పరిష్కారం లభించింది. గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న బోరులో నూతన మోటారును ఏర్పాటు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో చాలా రోజులుగా నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులకు ఊరట లభించింది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు రజినీకాంత్ రెడ్డి, నరేందర్, కర్రోళ్ల సిద్ధయ్యతో పాటు గ్రామ ప్రజలు పాల్గొని సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.