మక్క రైతు విలవిల!
- జాడలేని కొనుగోలు కేంద్రాలు
- దళారుల పలావుతున్న మొక్కజొన్న
- రోడ్లపై నీరసనలకు దిగిన రైతులు
- కొనుగోలు కేంద్రాలు పెంచాలని రైతుల డిమాండ్
మెట్ పల్లి, ఏప్రిల్ 9(విజయక్రాంతి): ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంటకు కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలు లేక మొక్కజొన్న పంటను దళారులకు అమ్ముకుంటూ రైతులు నష్టాల పాల వుతున్నారు. మెట్ పల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలంలో ఈ నెల రెండున మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభం చేశారు. కాని ఇప్పటికి అక్కడ ఒక్క క్వింటాలు మొక్కజొన్న కొనుగోలు జరగలేదు.దింతో రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన బాట పడుతున్నారు.
నియోజకవర్గ పరిధిలో అధికంగా మొక్కజొన్న
కోరుట్ల నియోజకవర్గ పరిధిలో ఈ ఏడు 20,410 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు.మెట్ పల్లి మండలంలో 4902 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయగా, కోరుట్ల 1253,ఇబ్రహీంపట్నం 7884,మల్లాపూర్ 6371ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయ డం జరిగింది. ప్రతి ఏడు మార్చి చివరి నుం డి ఏప్రిల్ నెల ప్రారంభం లో మొత్తం మొక్కజొన్న ను రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్మకాలు చేస్తారు. కాని ఏప్రిల్ నెల ప్రారంభం అయిన అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రా ల ప్రారంభం చేయక పోవడం, అకాల వర్షలు వస్తుండడం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
రైతుకు మరో దెబ్బ ఇరవై ఐదు క్వింటల్లా కొనుగోలు
మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ప్రతి రైతు నుండి ఎకరాకు కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తాం అనే నిబంధన రైతులకు శాపం గా మారింది. రబిలో ప్రతి ఏడు ఎకరానికి ముప్పు ఐదు నుండి నలభై క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాని ప్రభుత్వ నిబంధనతో ఇరవై ఐదు క్వింటాల్లు పోను మిగతా మొక్కజొన్న పంటను మళ్ళీ దళారుల పాలు చేసి నష్ట పోవాల్సిన పరిస్థితి నెలకొంది.
కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు ఇరవై నాలుగు వందలు ఉండగా దళారులు కేవలం పదిహేడు వందలకు క్వింటాలు కొనుగోలు చేయడం తో రైతులు ఎకరానికి సుమారు ముప్పు వెల వరకు నష్ట పోతున్నారు.అలాగే మండలంకు ఒక్క కొనుగోలు కేంద్రంతో ఉండడం తో రైతులకు అదనంగా రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి, ప్రతి మండలంకు రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల కోసం ఆందోళనలు తీవ్రం చేస్తాం
నియోజకవర్గ పరిధిలో వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయకుంటే ఆందోళనలు తీవ్రం చేయనున్నాం. అలాగే ఎకరానికి ఇరవై ఐదు క్వింటల్లా కొనుగోలు నిబంధనను తొలగించి రైతు దగ్గర ఉన్న మొత్తం మొక్కజొన్న ను కొనుగోలు చేయాలి.
మారు మురళీధర్ రెడ్డి
రైతు ఐక్య వేదిక నాయకులు
వెలుల్ల




