10 April, 2026 | 1:50 AM

ఎస్‌ఎస్సీ ఫలితాల్లో గిరిజన యువకుడు రేవన్ ప్రతిభ

10-04-2026 12:12 AM

చారకొండ, ఏప్రిల్ 9స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్సీ) తాజాగా ప్రకటించిన ఫలితాల్లో మండలంలోని మర్రిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బోడబండ తండాకు చెందిన సబావత్ రేవన్ సూపరింటెండెంట్గా ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీ పరీక్షలో రేవన్ తన ప్రతిభను చాటి ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. రేవన్ గత ఏడాది డిసెంబర్ లో గ్రూప్-3 ఉద్యోగానికి ఎంపికై తన సత్తా చాటారు. ప్రస్తుతం క్రీడా శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు.

విధి నిర్వహణలో ఉంటూనే పట్టుదలతో చదివి ఇప్పుడు సూపరింటెండెంట్గా ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని దక్కించుకోవడం విశేషం. రేవన్ తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు కావడం గమనార్హం. తల్లి శిల్పాదేవిలాల్ గతంలో చారకొండ సర్పంచిగా సేవలు అందించగా, తండ్రి దేవీలాల్ చౌహాన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రేవన్ సాధించిన ఈ విజయం పట్ల కుటుంబ సభ్యులు, తండా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, తండా యువతకు రేవన్ స్పూర్తిగా నిలిచారని పలువురు అభినందనలు తెలియజేశారు.