14-11-2025 10:41:38 PM
కుభీర్,(విజయక్రాంతి): కుబీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన రైతు నాయకుడు శ్రీరాముల రాజేష్ తన గేదె అనారోగ్యానికి గురైన సమయంలో గ్రామంలోని పశువైద్యశాలకు ఎన్నిసార్లు వెళ్లినా సంబంధిత పశువైద్యుడు విధులకు హాజరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసరంగా పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ, వైద్యుడు వచ్చి గేదెకు తూతూ మంత్రంగా మాత్రమే పరీక్షలు చేసి వెళ్ళిపోయాడని తెలిపారు.
ఇలా వైద్యుడు నిర్లక్ష్యం వహించడంతో రూ.1.50 లక్ష విలువ చేసే గేదె మృతి చెందిందని రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యంపై సంబంధిత పశువైద్యాధికారిణిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్యుని నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతు మృతి చెందిన గేదెను వెటర్నరీ ఆసుపత్రి ఎదుట వదిలిపెట్టి ధర్నా చేపట్టారు. ఇక, తమవైపు వివరణ ఇస్తూ సంబంధిత పశువైద్యాధికారిణి గేదె అనారోగ్యానికి గురైన వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇచ్చినప్పటికీ ఆరోగ్యం నిలదొక్కుకోలేదని వివరించారు.