14-11-2025 10:44:30 PM
వైద్యులకు సన్మానం చేసిన మాజీ మంత్రి
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పేరును ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించేలా ఇక్కడి ప్రాంత యువకులు మేధావులు కృషి చేయడం అభినందనీయమని రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం నిర్మల్ పట్టణంలో ఇటీవల ఐరన్ మ్యాన్ అవార్డును పొందిన నరసింహారెడ్డిని ఐఎంఏ సంయుక్త కార్యదర్శులు ఎన్నికైన డాక్టర్ రామకృష్ణ మాజీ మంత్రి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ పట్టణానికి చెందిన అనేకమంది మేధావులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని కొనియాడారు జిల్లా ఖ్యాతిని ప్రకటించవద్దంగా గుర్తింపు తెచ్చాలా ఇక్కడ ప్రాంత వాసులు కృషి చేయడం అభినందన నియమన్నారు.