14-11-2025 10:37:17 PM
అనంతరం వనదుర్గా ప్రాజెక్ట్ సందర్శన
ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కవిత
పాపన్నపేట,(విజయక్రాంతి): తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని సందర్శించారు. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆమెను ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ప్రాజెక్టును ఆమె సందర్శించి మాట్లాడారు.
తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లాను సందర్శించినట్టు ఆమె పేర్కొన్నారు. వనదుర్గా ప్రాజెక్టును ఎత్తు పెంచితే భవిష్యత్తులో ఆలయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. భక్తులకు సమస్య ఉండదని పేర్కొన్నారు. త్వరితగతిన ఎత్తు పెంచే పనులు ప్రారంభించి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.