17 July, 2026 | 1:09 AM

కదిలిపోతున్న మేఘాలు... నేలరాలని చినుకు

17-07-2026 01:09 AM

వర్షాల కోసం రైతన్నలు ఆశగా ఎదురుచూపులు

సాగు చేసిన పంటలకు తీరని తేమ కొరత.. 

కొండపాక, జూలై 16: సిద్దిపేట జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర ఆం దోళనకు గురిచేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ము కుంటున్నప్పటికీ, నేలను తడిపే వర్షం మా త్రం కురవడం లేదు. అప్పుడప్పుడు చల్లని గాలులు వీచి, మేఘాలు చేరినా కొద్దిసేపటికే చెదిరిపోతుండటంతో రైతుల్లో నిరాశ పెరుగుతోంది.

చినుకులు కూడా సరిగా పడక పోవడంతో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలు తేమ లేక వాడిపోతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో కురిసిన స్వల్ప వర్షాలతో రైతులు పెద్దఎత్తున విత్తనాలు వేశారు. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పొలాల్లో తేమ పూర్తిగా తగ్గిపోయింది. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో పరి స్థితి మరింత ఆందోళనకరంగా మారింది. నీటి వనరులు లేని రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.

కొంతమంది రైతులు పెట్టిన పెట్టుబడి మీద పడుతుందని ట్యాంకర్ల ద్వారా నీటిని తమ పొలాలకు చేరవేస్తున్నారు.వాతావరణంలో మేఘాలు కని పిస్తున్నా వర్షం కురవకపోవడంతో పంటల ఎదుగుదల నిలిచిపోయిం దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూ డు రోజుల్లో మంచి వర్షాలు కురవకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు పరిస్థితిని ఎప్ప టికప్పుడు పరిశీలించి రైతులకు అవసరమైన సూచనలు అందించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసి రైతన్నల ఆశలు నెరవేరాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.