ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
ఎర్రుపాలెం జులై 16 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 60 మంది లబ్ధిదారులకు మొత్తం ఇరవై ఒక్క లక్షల 26వేల 500 రూపాయలను మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నర్సింహారావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డితో కలిసి అందించారు.
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.
మండల అభివృద్ధి కార్యాలయంలో 8 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మండల తాసిల్దార్ సునీత ఎలిజిబెత్ తో కలిసి మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ శారద, ఆర్ ఐ రవికుమార్, శిరీష, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, అనుమోలు కృష్ణారావు, శీలం వెంకట్రామిరెడ్డి, సర్పంచులు అన్నపూర్ణ , రాములు పాల్గొన్నారు.






