24 June, 2026 | 2:35 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •  

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు అష్ట కష్టాలు

05-05-2026 12:00 AM

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ 

మహబూబాబాద్, మే 4 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తి రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొందని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్ వద్ద తొర్రూరు మహబూబాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా, వారికి మాజీమంత్రి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతుకు ఏనాడు కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కష్టం రాకుండా చూసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రచారం తప్ప ఆచరణలో ఎక్కడ కూడా రైతుకు అండగా నిలిచినట్లు కనిపించడం లేదని విమర్శించారు. పంటలు పండించడం ఒక ఎత్తుతై, వాటిని విక్రయించడం మరో సమస్యగా మారిందని, ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి రైతులను ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని డిమాండ్ చేశారు.