5 May, 2026 | 2:02 AM

అకాల వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

05-05-2026 12:00 AM

ఎస్‌ఐ చల్ల రాజు

వెంకటాపూర్, మే 4 (విజయక్రాంతి): అకాల వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్త్స్ర చల్ల రాజు అన్నారు. మండల కేంద్రం శివారులో ధాన్యం ఆరబోసిన రైతులతో స్థానిక ఎస్త్స్ర చల్ల రాజు మాట్లాడి పంట పరిస్థితులు, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో ఉరుములు, మెరుపులు, గాలిదుమారంతో అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షంలో తడవకుండా తార్పాలిన్, పట్టాలు సిద్ధంగా ఉంచుకోవాలని,

తడిసిన ధాన్యం నాణ్యత తగ్గే ప్రమాదం ఉన్నందున సకాలంలో మా ర్కెట్లకు లేదా ఐకెపి కేంద్రాలకు తరలించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొం దాలని సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరబోసే చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని, వాహనదారుల భద్రత దృష్ట్యా అలాంటి చర్యలను నివారించాలని హెచ్చరించారు. నకిలీ విత్తనాలపై కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నమ్మకమైన డీలర్లు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యవసా య కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలపై సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.