11 May, 2026 | 4:49 PM

సేంద్రియ ఎరువులపై రైతన్న ఆసక్తి

11-05-2026 03:20 PM

వాంకిడి,(విజయక్రాంతి): ప్రస్తుతం రైతులు సేంద్రియ ఎరువుల వైపు దృష్టి సారించారు. రైతులు దుక్కులు దున్నుకుంటున్నారు. దీనిలో భాగంగా పంటచేళ్లలో భూసారాన్ని పెంచడానికి, సహజ ఎరువులు, భూములను సారవంతం చేయడానికి పశువుల పెంపకం దార్లతో రైతులు ఒప్పందం చేసుకొని వారి వారి పంటచేళ్లలో ఆవు పేడ, గొర్రె మందలను కూర్చోబెడుతున్నారు. అలాగే రైతుల వద్ద సహజ ఎరువులను ట్రాక్టర్లతో, ఎడ్లబండ్లతో వారి పంట చేనులకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఆవు గేదెల ఎరువుకు రూ .1900 వందల నుండి రూ.2500కు తీసుకుంటున్నారని రైతులు పేర్కొన్నారు.