11 May, 2026 | 4:30 PM

ఉపాధి పనులు పరిశీలన

11-05-2026 03:15 PM

పనులు పరిశీలిస్తున్న సర్పంచ్ పవన్ కుమార్ 

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని జంబులదరి గ్రామపంచాయతీ పరిధిలోని లంజన్ వీర శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనులను జంబుల్ దారి గ్రామ సర్పంచ్ పవన్ కుమార్, ఉప సర్పంచ్ గుర్నుల విఠల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నుల నారాయణలతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్దేశించిన కొలతల ప్రకారం పనులు చేయాలని కూలీలకు సూచించారు. కూలీలకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఉపాధి హామీ సిబ్బంది, ఉపాధి కూలీలు తదితరులు ఉన్నారు.