9 May, 2026 | 11:03 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

రైతులకు రుణమాఫీ జరగలేదు

17-09-2025 12:47 AM

ఎఫ్.ఎస్.సీ.ఎస్ డైరెక్టర్ పదవికి చందుపట్ల ధర్మారెడ్డి రాజీనామా 

ఘట్ కేసర్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ రైతు సేవా సహకార సంఘం గత మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ అవినీతి, అక్రమాలకు పాల్పడడంతో కేవలం ఘట్ కేసర్ సొసైటీ లో మాత్రమే రైతు రుణమాఫీ జరగలేదని రైతు సొసైటీ డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలకమండలి అలసత్వంతో కూడిన నిర్లక్ష్యం వల్ల గత మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు.

ఎఫ్.ఎస్.సీ.ఎస్ లో రుణాలు పొందిన 1189 మంది రైతులకు రుణమాఫీ అమలు కాలేదని భవిస్తూ, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ నా డైరెక్టర్ పదవికి నేడు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  రుణమాఫీ లీస్టులో చాలా రకాల తప్పుగా జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ జరిగిందన్నారు.

ఈక్రమంలోనే ఇంటర్నల్ ఆడిట్ జరిపిన సహకార, వ్యవసాయ అధికారులకు 43 మంది రుణమాఫీకి అర్హులు కాని పేర్లు గుర్తించారని, దీంతో రుణమాఫీ లీస్టులో నుంచి 43 మంది పేర్లు తొలగించి మరోసారి పంపాలని వ్యవసాయ అధికారులు సూచించినట్లు తెలిపారు. ఆపేర్లని తీసివేస్తే తన అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని భయపడ్డ గత మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ ప్రభుత్వానికి రుణమాఫీ లీస్టు పంపడంలో కుంటిసాకులు చూపుతూ ఆలస్యం చేశాడని తెలిపారు.