28న కరీంనగర్‌లో రైతుల మహా గర్జన సభ
ముషీరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): కరీంనగర్‌లో ఏప్రిల్ 28న ఓసీ ఐకాస, రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జనకు సభకు అంచనాలకుమించి రెండు లక్షల మంది హాజరవుతున్నట్లు రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డిలు వెల్లడించారు.
ఆదివారం హైదారాబాద్ నగరంలోని హిమాయత్ నగర్‌లోని సమాఖ్య కార్యాలయంలో జాతీయ, రాష్ట్ర జిల్లాల రైతు ప్రజాసంఘాల నాయకులతో రైతుల మహాగర్జన సమరభేరి సభ విజయవంతం చేయడానికి ఏర్పాట్లపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలా డి రామారావు,
రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపా ల్‌రెడ్డిలు హాజరై మాట్లాడుతూ రాష్ట్ర భడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులు తగ్గించడమే కాకుండా కౌలు రైతులకు ఇచ్చిన హామీల ఊసే లేదని అన్ని రకాల పంటలకు రూ.500ల బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకాల పంటలకు అరకొరగా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మోసగిస్తోందని విమర్శించారు.
ఈ సమావేశంలో ప్రజా సంఘా ల జాతీయ సలహాదారు రావుల నరసింహా రెడ్డి, ప్రథాన కార్యదర్షులు గట్టు మహేష్ బాబు, సంది తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు చందుపట్ల నరసింహరెడ్డి, అయిత నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




