30 March, 2026 | 2:34 AM

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

30-03-2026 12:03 AM

పెబ్బేరు మార్చి 29: పట్టణ కేంద్రంలో తెలుగు దేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎస్. రామన్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీగా, అన్యాయానికి ఎదురు నిలిచిన శక్తిగా తెలుగుదేశం పార్టీ నిలిచిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం కలగలిపిన పాలనకు ఈ పార్టీ మారుపేరుగా నిలిచిందని పేర్కొన్నారు.

మహానేత ఎన్ టి రామ రావు ఆలోచనలతో పార్టీ ఆవిర్భవించిందని, నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందని తెలిపారు. ప్రస్తుతం యువనేత నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ భవిష్యత్తు కోసం మరింత బలంగా ముందుకు సాగుతోందన్నారు.44 ఏళ్లుగా ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న ఈ మహా ఉద్యమానికి వందనం తెలుపుతూ, తెలుగు గౌరవానికి ప్రతీక అయిన ఈ పార్టీలో పనిచేయడం తనకు గర్వకారణమని, ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ కుటుంబంలో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని రామన్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వాకిటి బాలరాజ్, రాజు, శెట్టి రాఘవేందర్ గౌడ్, నాగేంద్రం, జానీ, మురళి గౌడ్, సితార వెంకటేష్, సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్, బీసీ పొలిటికల్ జేఏసీ కార్యదర్శి వి.వి. గౌడ్ తదితరులు పాల్గొన్నారు.