మూడు నెలల రేషన్ ఒకేసారి
జిల్లాలో సరిపడా రేషన్ అందుబాటులో
ఏప్రిల్ నుంచి పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న అధికారులు
మూడు నెలల ముందస్తు బియ్యం పంపిణి పట్ల అవగాహన తప్పనిసరి
ఎండాకాలంను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబందించి పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోవద్దని ఉదేశ్యంతో మూడు నెలలకు సంబందించిన రేషన్ బియ్యాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను సమాయుక్తం చేసింది.
వనపర్తి, మార్చి 29 (విజయక్రాంతి): ఎండాకాలంను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సామాన్య ప్రజలు, నిరుపేద లకు రేషన్ బియ్యం పంపిణిలో ఎలాం టి ఇబ్బందులు ఉండవద్దనే ఉద్దేశ్యంతో కేం ద్ర ప్రభుత్వం మూడు నెలలకు సంబందించిన రేషన్ బియ్యం ను ఒకేసారి పంపిణి చే యాలని నిర్ణయం తీసుకుంది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కు ఉత్తర్వులు జారీ చేయగా అందుకు అనుగుణంగా జిల్లా పౌర సరఫరా ల శాఖ అధికారులను సమాయుక్తం చేసింది.
మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణి
ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణి చేయడం ద్వారా రవాణా సమస్య లతో పాటు ఎండలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా చేయడం వల్ల రవాణా చార్జీల ఖర్చు తగ్గడంతో పాటు డీలర్లకు, హమాలీలకు కూలి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లను సిద్ధం చేసుకుంది . ప్రస్తుతం భారీ మొత్తంలో రవాణా చేసినందుకు వారి వద్దనున్న వాహనాలతో సాధ్యమేనా అన్న ప్రశ్న సైతం తలెత్తుతుంది.
మూడు నెలల ముందస్తు బియ్యం పంపిణి పట్ల అవగాహన తప్పనిసరి
ఎండాకాలంను దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా మూడు నెలలకు సంబంధించిన రేష న్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కానీ పంపిన పట్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు అవగాహన తప్పనిసరిగా కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది . సాధారణంగా రేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ షాపుల వద్దకు వెళ్లి వేలిముద్రలో లేదా ఐరిస్ ద్వారా రేషన్ బియ్యం పొందుతుంటారు.
ఒకసారి వెలుముద్ర లేదా ఐరిష్ ద్వారా ఒక నెలకు సంబంధించిన రేషన్ మాత్రమే వస్తుంది. మూడు నెలలకు సంబంధించి మూడుసార్లు వేయాల్సి ఉంటుంది ఈ విషయంపై సంబంధిత అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవగాహన కల్పించడంలో విఫలమైతే రెండు నెలల రేషన్ బియ్యం మాయమయ్యే అవకాశాలు సైతం మెండుగా ఉన్నాయి.
జిల్లా వివరాలు....
జిల్లా వ్యాప్తంగా 161316 రేషన్ కార్డులు ( 10214 అంత్యోదయ కార్డులు, 1072470 ఎఫ్ ఎస్ సి కార్డులు, 109 అన్నపూర్ణ కార్డులు ) ఉండగా 558334 మంది లబ్ధిదారులకు గాను 10555.422 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతినెల సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రేషన్ తీసుకునే లబ్ధిదారులు విధిగా మూడు సార్లు వేలిముద్రలు వేయాలి
మూడు నెలల రేషన్ బియ్యం ను రేషన్ షాపుల ద్వారా అందించేందుకు సరిపడ బియ్యం వనపర్తి జిల్లాలో అం దుబాటులో ఉంది. వనపర్తి జిల్లాలో వ రివరి పంటను అత్యధికంగా పండించ డం వల్ల బియ్యం కొరత సమస్య ఉం డదు. రేషన్ తీసుకునే లబ్ధిదారులు విధి గా మూడుసార్లు వేలిముద్రలు వేయా ల్సి ఉంటుంది అప్పుడే మూడు నెలల రేషన్ బియ్యం అందుతుంది. ఈ విషయంపై రేషన్ డీలర్లకు సైతం సూచనలు చేయనున్నాం.
కాశి విశ్వనాధ్, పౌర సరఫరాల శాఖ అధికారి, వనపర్తి జిల్లా




