12 March, 2026 | 10:11 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

తెలంగాణ రైజింగ్ - 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి

22-10-2025 12:00 AM

కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపు 

ఈనెల 25తో ముగియనున్న సర్వే

నిజామాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్ - 2047 ‘ సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా అన్ని వర్గాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారని అన్నారు.

భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ - 2047 ‘ సిటిజన్ సర్వేను చేపట్టిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వతేదీ తో ముగుస్తుందని, ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising అనే వ్బుసైట్ ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు , సూచనలను అందించాల్సింగా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో కోరారు.