15 May, 2026 | 3:51 AM

జొన్నలు కొనుగోలు చేయరేమోనని రైతులు ఆందోళన పడొద్దు

15-05-2026 01:32 AM

కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఎమ్మెల్యే పాయల్

ఆదిలాబాద్, మే 14 (విజయక్రాంతి) : రైతులు పండించిన జొన్న పంటను పూర్తిగా నూటికి నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గురువారం సాత్నాల మండలం కాన్పు మేడిగూడ గ్రామంలోని రైతు వేదికలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా తూకం కాంటాలకు ప్రత్యేక పూజలు చేసి, మార్కెట్ యార్డ్ పంట తీసుకొచ్చిన తొలి రైతును సన్మానించి, కొనుగోళ్లను లాంఛనగా ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇప్పటి వరకు అనేక కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, జొన్నలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో వ్యవసాయ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ఎక్కడ ప్రభుత్వం తమ జొన్న పంటను కొనుగోలు చేయదేమో రైతుల్లో ఉన్న భయాందోళన కారణంగా మార్కెట్ యార్డ్ లలో రద్దీ ఏర్పడి గందరగోళం నెలకొందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా ఆలోచిస్తున్నామని తెలిపారు. జొన్న పంట కోటను పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మార్కెట్ చైర్మన్ అశోక్ రెడ్డి, తహసిల్దార్, అధికారులు, రైతు నాయకులు, రైతులు, పాల్గొన్నారు