డిగ్రీ కళాశాల సమస్యలను పరిష్కరిస్తా..
ఉట్నూర్, మే 14 ( విజయ క్రాంతి ): ఉట్నూర్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్య వారోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కలశాల సిబ్బంది ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు, ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ... ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళాశాల లో సమస్యలు తెలియజేసిన వెంటనే పరిష్కరించారని,ఆదివాసీ విద్యార్థుల అభ్యునాతికి కృషి చేస్తున్నాం అని సౌకర్యాలు కల్పిస్తునందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యత పెంచుటకు ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది అని,ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో సమస్యలు తెలియగానే పుస్తకాలు ఇప్పించాం , ప్రహరీ గోడ నిర్మించాం, ఇంకా కావలసిన వసతులు కల్పనకు కృషి చేస్తాం అన్నారు. విద్యార్థులు,ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు చెట్లు నాటుతూ ,పర్యావరణ రక్షణలో భాగం కావలి అన్నారు కళాశాలలో బయో ,కెమిస్ట్రీ ల్యాబ్స్ పరిశీలించారు, మెడికల్ క్యాంప్ ప్రారంభించారు. కళాశాలలో విద్యార్యుల సంఖ్య పెంచేందుకు కృషి చెయ్యాలి, ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్య బలోపేతానికి కృషి చేస్తుంది అన్నారు.ఎమ్మెల్యే సిబ్బంది శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు,సర్పంచ్లు, పేరెంట్స్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






