calender_icon.png 3 May, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడ్లబండ్లపై ఎలుకతుర్తికి..

23-04-2025 12:27:52 PM

స్వాగతం పలికిన సత్యవతి రాథోడ్ 

మహబూబాబాద్,(విజయ క్రాంతి): బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సూర్యాపేట జిల్లా(Suryapet District) ఆత్మకూరు (ఎస్) మండలంలోని నరసింహ పేట రామోజీ తండా, ఆత్మకూరు గ్రామాలకు చెందిన రైతులు బొల్లా వెంకట్రెడ్డి, తంగెళ్ల శ్రీనివాసరెడ్డి, గంధం నరసయ్య, మధుసూదన్ రెడ్డి, రాములు తదితరులు ఎడ్లబండ్లపై ఎలుకతుర్తికి బయలుదేరారు. బుధవారం మార్గమధ్యలో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) దంతాలపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఎడ్లబండ్లపై రైతులు ఎలుకతుర్తి సభకు వెళుతున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) అక్కడికి వెళ్లి స్వాగతం పలికారు.

రైతులకు పండ్లు అందించి, ఎడ్లబండ్లపై ఎలుకతుర్తికి చేపట్టిన యాత్ర వివరాలను అడిగి తెలుసుకుని, మార్గమధ్యలో ఏ ఇబ్బందులు తలెత్తిన సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కేసీఆర్ నాయకత్వంలో రైతు సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని, దానికి కృతజ్ఞతగా ఈరోజు రైతులు స్వచ్ఛందంగా ఎలుకతుర్తి సభకు ఎడ్లబండ్లపై బయలుదేరి తమ అభిమానాన్ని చాటుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు బిక్షం రెడ్డి, వెంకన్న సతీష్, లింగయ్య గౌడ్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.