03-05-2025 08:53:17 AM
శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు పీడ్ బ్యాక్ విధానం
భక్తుల తమ అభిప్రాయాలను వాట్సప్ ద్వారా తెలిపేలా కొత్త విధానం
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాట్సప్ లో టీటీడీ ఫీడ్ బ్యాక్ పేజ్
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్ బ్యాక్(TTD feedback system) విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ. భక్తులు తమ అభిప్రాయాలను వాట్సప్ ద్వారా తెలిపేలా కొత్త విధానం వచ్చింది. తిరుమలలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ల ద్వారా అభిప్రాయాలను సేకరించనున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాట్సప్ లో టీటీడీ ఫీడ్ బ్యాక్ పేజ్ తెరుచుకోనుంది. భక్తులు తమ పేర్లు నమోదు చేసి ఫీడ్ బ్యాక్ ఇచ్చేలా కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. అన్నప్రసాదం, లడ్డూలు, దర్శన అనుభవంపై ఫీడ్ బ్యాక్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. కల్యాణకట్ట, శుభ్రదత, లగేజ్, గదులు, ఇతర ఆప్షన్లు ఎంచుకునేలా కొత్త విధానం అమలులోకి రానుంది.