calender_icon.png 3 May, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగిరిలో మహిళ దారుణ హత్య

03-05-2025 09:53:35 AM

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం(Ramagiri Mandal) కల్వచర్ల వద్ద శనివారం మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను సిమెంట్ ఇటుకతో తలపై కొట్టి దుండగులు హత్య చేశారు. మృతురాలు మంచిర్యాల జిల్లా ఐబీతాండూరుకు చెందిన మహిళగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన రామగిరి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మహిళను ఎందుకు చంపారు? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.