7 May, 2026 | 12:20 PM

వానలు కురవాలని రైతుల మొక్కులు

24-06-2024 12:05 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): వానాకాలం సీజన్ ప్రారంభమై రోహిణీ కార్తె దాటి దాదాపుగా 15 రోజులు అవుతున్నప్పటికీ అనుకులంగా వర్షాలు కురవకపోవడంతో అన్నదాతల్లో అందోళన మొదలైంది. వ్యవసాయ పనులు ప్రారంభించి 70 శాతం వరకు విత్తనాలు నాటారు. ఈ క్ర మంలో వర్షాలు సమృద్ధిగా కరవకపోవడంతో ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌కు చెందిన రైతులు కప్పతల్లి ఆట అడారు. గ్రామంలోని పోచమ్మ ఆలయంలో జలాభిషేకం చేశారు. గ్రామ సమీపంలో చేలలో దేవుళ్లకు మేకలతో మొక్కులు చెల్లించారు.