గంటకోసారి కరెంటు పోతుంది!
16-09-2026 | 04:20am
మరీ సాగునీరు ఎలా?
తీగలపల్లి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 15: అప్రకటిత విద్యుత్ కోతల(Power cuts)తో పంటలకు సాగునీరు అందడం లేదని ఆరోపిస్తూ రైతులు మంగళవారం కోడేరు మండలం తీగలపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్(Teegalapalli substation) ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. బాబాయిపల్లి, జనంపల్లి, తీగలపల్లి గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ప్రభుత్వం వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెపుతున్నా, తమ గ్రామాల్లో ఐదారు గంటలు మాత్రమే సరఫరా అవుతోందని, అదీ గంటకోసారి వచ్చిపోతుండటంతో పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.