30 June, 2026 | 10:09 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

13-05-2025 12:15 AM

గోపాలపేట మే 12; తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై రైతులు పలు అంశాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయమూర్తి రజిని, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అసిస్టెంట్ రఘు అన్నారు. సోమవారం గోపాలపేట మండల కేంద్రంలో జిల్లా న్యాయవిజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు.  తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతుంది,

అందులో భాగంగా వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని భూభారతి చట్టాన్ని ప్రారంభించారన్నారు.  ఈ చట్టంలో సాదా బై నామలకు పరిష్కార మార్గాలు చూపిస్తుందని దీనితో పాటు సెక్షన్ 15(8) రూల్ 16- ప్రకారం రైతులు ఉచిత న్యాయ సాయం కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఉచిత న్యాయం పొందవచ్చని  తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గోపాల్ పేట రెవిన్యూ తహసీల్దార్ పాండు నాయక్ గారు ఎం.ఆర్.ఐ  యాదయ్య, శేషయ్య, శ్రీదేవి, రెవెన్యూ సిబ్బంది మరియు మండల ప్రజలు పాల్గొన్నారు.