calender_icon.png 13 May, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దమ్మతల్లి ఆలయంలో వైభవంగా చండీ హోమం

13-05-2025 12:13:54 AM

భద్రాద్రి కొత్తగూడెం, మే 12, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేపీ జగన్నాధపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మతల్లి) లో సోమవారం చండీ హోమం వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలతో వేదమంత్రాలతో అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దేవాలయం నుంచి వేగశాలకు తీసుకువచ్చి మండపారాధన గణపతి పూజలు నిర్వహించారు. అనంతరం చండీ హోమం చివరన పూర్ణహోతి కార్యక్రమం నిర్వహించారు.ఈ హోమంలో 17 దంపతులు పాల్గొన్నారు. 

అర్చకులు వేద పండితులు చండీ హోమంలో పాల్గొని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్ రజిని కుమారి పాలకమండలి చైర్మన్ బాలునేని నాగేశ్వరరావు ధర్మకర్తలు చీకటి కార్తీక్ అడుసు మల్లి సాయిబాబు పెండ్లి రాంరెడ్డి,భూక్య గిరిప్రసాద్, చెవుగాని పాపారావు, చెరుకూరి శేఖర్ బాబు, సందుపట్ల రమ్య, శనగారపు శ్రీనివాసరావు, దుగ్గిరాల సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు.