10 July, 2026 | 3:09 AM

ప్రత్యామ్నాయ పంటల వైపు మల్లించాలి

10-07-2026 02:05 AM

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్, జూలై 9 (విజయక్రాంతి): జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల కాల్వల ద్వారా సాగునీటి సరఫరాకు ప్రస్తుతం నీటి లభ్యత లేదని రైతులకు స్పష్టం చేయాలన్నారు. మండలాల వారీగా పంటల మార్పు ప్రణాళికలు రూపొందించి, రైతు వేదికలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.

జొన్న, సజ్జ, మొక్కజొన్న, కంది, మినుము వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు, డ్రిప్ ఇరిగేషన్తో సాగు చేసే ఉద్యాన పంటలను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువుల పంపిణీ చేయాలని ఆదేశించారు. నేటి నుంచి మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ ప్రారంభమైందని, సేవా రుసుముగా రూ.10 మాత్రమే వసూలు చేయాలని, అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.