అవకాశమిస్తే ఆర్సీపురానికి సేవ చేస్తాం
ఆర్.ఆర్.కె ఫౌండేషన్ లక్ష్మీప్రసన్న
రామచంద్రపురం జూలై 9: రామచంద్రాపురం పట్టణంలో ఆర్‌ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న జన్మదినాన్ని పురస్కరించుకుని సు మారు వెయ్యి మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మీ ప్రసన్న గత వంద రోజులుగా డివిజన్లోని ప్రతి కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటిని నమోదు చేసి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.
రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో అవకాశం లభిస్తే ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే సిద్ధం చేసిన ప్రజా మేనిఫెస్టోను అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా, ప్రజల సమస్యల ఆధారంగా రూపొందించిన ప్రణాళికతో ప్రజా సేవను కొనసాగిస్తామని, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడటం తమ లక్ష్యమని లక్ష్మీ ప్రసన్న స్పష్టం చేశారు.






