11 June, 2026 | 2:25 AM

పశుసంపద, ప్రత్యామ్నాయ పంటలతో రైతులు ఆదాయం పెంచుకోవాలి

11-06-2026 01:30 AM

నాగర్ కర్నూల్ జూన్ 10 (విజయక్రాంతి): పశుసంపద రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆదాయ మార్గమని, నీటి వనరులను ఆదా చేస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామంలో గ్రామసభలో పాల్గొన్న ఆయన ఉచిత పశు టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి, ఉపాధి హామీ పనుల్లో చెరువు పూడికతీత పనులను పరిశీలించారు.

పశువులకు ఉచిత టీకాలు వేయించడం ద్వారా అంటువ్యాధులను నివారించి రైతులు ఆర్థిక నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. చెరువుల నుంచి వెలికితీసే వండ్రు మట్టి పంట పొలాలకు సారాన్ని పెంచి దిగుబడులు మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, రాగి వంటి చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు. గ్రామాభివృద్ధికి ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు.