11 June, 2026 | 2:07 AM

గ్రామాల అభివృద్ధికి రూ.1.25 కోట్ల నిధులు

11-06-2026 01:29 AM

రేవల్లి, జూన్ 10: గత పాలకుల నిర్లక్ష్యానికి ఏదుల ప్రాజెక్టుకు గురైన బండరాయిపాకుల, కొంకలపల్లి గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మండల పార్టీ అధ్యక్షుడు సుల్తాన్ అలీ, వ్యవసాయ శాఖ కమిటీ ఉపాధ్యక్షుడు సత్యశిలా రెడ్డి స్పష్టం చేశారు.

బుధవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎంపీ మల్లురవిల సహకారంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ. 1.25 కోట్ల నిధులు మంజూరయ్యాయని  వారు తెలిపారు. డంపింగ్ యార్డ్ నుండి శనాయిపల్లి కుంట వరకు సైడ్ డ్రైన్ నిర్మాణానికి రూ.20లక్షలు, గౌరిదేవిపల్లి మెయిన్ రోడ్డు నుండి నాగిరెడ్డి ల్యాండ్ వరకు డ్రైన్ రూ. 36లక్షలు, శివాలయం హనుమాన్ దేవాలయాల కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి రూ. 45లక్షలు, అసంపూర్తిగా ఉన్న ప్రైమరీ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆర్‌అండ్‌ఆర్ కమిటీ ద్వారా నిధులు మంజూరయ్యాయి.

ఈ పనులన్నింటినీ త్వరలోనే టెండర్ల ప్రక్రియకు పంపుతా మని నాయకులు వెల్లడించారు. అలాగే రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికను కూడా అత్యంత పారదర్శకంగా పూర్తి చేస్తామని చెప్పారు. కొత్త పంచాయతీ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి నందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, సింగిల్ విండో చైర్మన్ లోడే రఘు, జిల్లా పార్టీ కార్యదర్శి వాడల పర్వతాలు, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.