calender_icon.png 15 November, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు: ఎమ్మెల్యే

15-11-2025 12:44:51 AM

- బోడులో కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు గ్రామంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్నీ ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను రైతులు ఉపయోగించుకోవాలని, దళారుల చేతులలో రైతులు మోసపోవద్దన్నారు. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం యొక్క ముఖ్య ఏజండా, రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ప్రజలను మోసం చేసే దళారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాటిని అరికట్టే విధంగా చూడాలన్నారు.