15-11-2025 12:46:26 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టంగా ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే కొనసాగుతున్నట్లు వెల్లడించాయని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే జి మధు సుధన్ రెడ్డి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిసిసి కార్యాలయం నుండి న్యూటన్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయం మా పార్టీపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి ప్రతీక అని, ఈ విజయంతో మాపైన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ లను అమలు చేస్తున్నామన గుర్తు చేశారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ను ప్రజలకు అవసరమైన సౌకర్యాలతో, మెరుగైన అవకాశాలతో కూడిన మహానగరంగా తీర్చిదిద్దే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి పథక రచన చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు అన్ని కూడా హైదరాబాద్ కు వస్తున్నాయి, తద్వారా లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు.
సోషల్ మీడియా బలుపు తో, పేయిడ్ చానల్స్తో కాంగ్రెస్పు విషం కక్కినా , ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు మోసపోరని మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు నిరూపించారనిచెప్పారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, టి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, టి పిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్,వినోద్ కుమార్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, , డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిజె బెనహర్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, నాయకులు సాయిబాబా, ఐఎన్టీయుసి రాములు యాదవ్, ప్రవీణ్ కుమార్, టంకర కృష్ణయ్య యాదవ్, అవేజ్, సంజీవరెడ్డి, ఫయాజ్, అజ్మత్ అలి, అర్షద్, కిషన్ నాయక్, పీర్ మహ్మద్ సాదిక్, లీడర్ రఘు, అక్బర్, తదితరులు పాల్గొన్నారు.