రైతులు దళారులను నమ్మవద్దు
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ, ఏప్రిల్ ౧9 (విజయక్రాంతి): రైతులు తమ పంటను అమ్ముకునేందుకు మధ్య దళారులను నమ్మి మోసపో వద్దని, పంటను నేరుగా మార్కెట్ యార్డుకు తీసుకురావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. ఆదివారం నేరడిగొం డలోని వ్యవసాయ మార్కెట్‌లో నాఫెడ్ వారిచే రాష్ట్ర మార్కుఫెడ్ ద్వారా పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ముందుగా తూకం కాంటాలకు ప్రత్యేక పూజలు చేసి మార్కెట్ కు పంటను తీసుకువచ్చిన తొలి రైతును సన్మానించి కొనుగోలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... పంట విక్రయాల్లో అధికారులు రైతులకు అవగాహన కల్పించి, వారికి సహకరించాలని అన్నారు. ఎంతో కష్టపడి పండించే పంటలు తక్కువ ధరలకు అమ్మితే నష్టపోతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






