ప్రవేట్ కంపెనీలపై పోరాటంతోనే తెలుస్తుంది
పామ్ ఆయిల్ రైతులపై తుమ్మలకు ఉన్న చిత్త శుద్ధి
మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వర్లు
దమ్మపేట,(విజయక్రాంతి): ప్రవేట్ కంపెనీలపై పోరాటం చేయడమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయిల్ ఫామ్ రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుతుందని మాజీ జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణ హార్టికల్చర్, తెలంగాణ ఆయిల్ ఫెడ్ మీద హై కోర్టులో ప్రైవేటు ఆయిల్ కంపెనీలు మూకుమ్మడిగా కుట్ర పన్ని ఆయిల్ పామ్ రైతాంగాన్ని శాశ్వతంగా దోచుకోవడానికి వేసిన రిట్ పిటిషన్ 3736/2026 లో జిఓ నంబర్ 594ను డిస్మిస్ చేయించడం ఆయన అంకితభావానికి నిదర్శనం అన్నారు.
తాను ఎంతో మానసిక ఒత్తిడిలో వున్నా, దుబాయ్ నుంచి వ్యవసాయ శాఖా ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చి ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు వేసిన రిట్ పిటిషన్ 3736/2026 ను డిస్మిస్ చేయించడానికి, ప్రభుత్వం తరపున కేసు వాదించటానికి గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ ను రంగంలోకి దింపారన్నారు. వాస్తవానికి ఈ కేసు ను ప్రభుత్వం తరపున, వ్యవసాయ శాఖ తరపున ప్రభుత్వ ప్లీడర్ హాజరవ్వాల్సిన తరుణంలో, ప్రైవేట్ ఆయిల్ కంపెనీల తరపున సుప్రీం కోర్టు ప్రముఖ లాయర్ శ్రీ గోపాల్ సుబ్రహ్మణ్యం, మాజీ సుప్రీం కోర్టు సోలిసిటర్ జనరల్ ను లక్షల రూపాయలు ఫీజు వేచించి ఎంగేజ్ చేసుకుంటే,
కేసు తీవ్రత దృష్ట్యా రిట్ పిటిషన్ ను డిస్మిస్ చేయించడానికి తుమ్మల ఆఖరి నిమిషంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ను తీసుకురావడం మంత్రికి ఆయిల్ ఫామ్ రైతులపై ఉన్న చిత్తశుద్ధి స్పష్టమైందన్నారు. కేసుపై తుమ్మల తీసుకున్న చర్యని మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరావు, రాష్ట్ర ఆయిల్ పామ్ అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్, రైతు సంఘాల నాయకులు, ఆయిల్ పామ్ రైతులు, టి జి ఆయిల్ ఫెడ్ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .




