9 May, 2026 | 7:30 AM

పంట కొనుగోలు కోసం రోడ్డెక్కిన రైతులు

09-05-2026 12:00 AM

నిర్మల్ జాతీయ రహదారిపై రాస్తారోకో 

నిర్మల్ మే 8 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే ఆ పంట కొనుగోలులో జాప్యం కారణంగా కారణం గా నష్టపోతున్నామని రైతులు శుక్రవారం నిర్మల్ జిల్లాలో ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని లోకేశ్వరం మండలం లోకేశ్వరం రాజుర బాగాపూర్ కిష్టాపూర్ గ్రామానికి చెందిన వందలాది రైతులు బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై నర్సాపూర్ మండలం రెండు గంటలు రాస్తారోకో నిర్వహించారు.

గురువారం కురిసిన వర్షంతో మొక్కజొన్న వరి పంటలు తడిసిపోయాయి పంట కొనుగోలు జాప్యం చేయడం, గోన సంచుల కొరత, లారీల కొరత కారణంగా పండిన పంటను కూడా అమ్ముకోలేని దుస్థితికి ప్రభుత్వ అధికారుల కారణమని మండిపడ్డారు.

పంటను వెంటనే కొనుగోలు చేయాలని గోలి సంచులు సరఫరా చేయాలని కొన్న ధాన్యాన్ని గోదాములకు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తాసిల్దార్ సూర్యారావు ఎస్త్స్ర గణేష్ అక్కడికి చేరుకొని సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చి 48 గంటల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన నిర్మించారు. రైతుల ధర్నాతో నిర్మల్ జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల పొడవులో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు